ETV Bharat / crime

అనుమతులు లేవని బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్​ - భవన నిర్మాణదారులను బెదిరించిన వ్యక్తి అరెస్ట్​

భవన నిర్మాణానికి సరైన అనుమతులు లేవని బెదిరించి.. వసూళ్లకు పాల్పడుతోన్న ఓ వ్యక్తిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆయా భవనాలపై జీహెచ్​ఎంసీ గ్రీవియెన్స్ సెల్, లోకాయుక్తలో ఫిర్యాదు చేయటం, ఆర్టీఐకు దరఖాస్తు చేయడం వంటి పనుల ద్వారా భవన యజమానులను, బిల్డర్లను బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

KPHB police have arrested a man for demanding money from builders
అనుమతులు లేవని బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Feb 14, 2021, 4:35 PM IST

భవన నిర్మాణదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తోన్న సీహెచ్.వెంకటసత్య వేణుగోపాల్​ను​ కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్​ చేశారు. వేణుగోపాల్ మియాపూర్​లో నివసిస్తున్నాడు. కేపీహెచ్​బీ కాలనీ, హైదర్ నగర్, అడ్డగుట్ట సొసైటీ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణదారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నాడు. నిర్మాణానికి సరైన అనుమతులు లేవని ఆయా భవనాలపై జీహెచ్​ఎంసీ గ్రీవియెన్స్ సెల్, లోకాయుక్తలో ఫిర్యాదు చేయటం, ఆర్టీఐకు దరఖాస్తు చేయడం వంటి పనుల ద్వారా భవన యజమానులను, బిల్డర్లను బెదిరిస్తున్నాడు. పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవాడని సీఐ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఈ విధంగా ఇప్పటి వరకు సుమారు నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడని సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్​ చేశారు. వేణుగోపాల్ నుంచి ఆర్టీఐ దరఖాస్తు పత్రాలు, లోకాయుక్త పిటిషన్లు, జీహెచ్​ఎంసీ గ్రీవియెన్స్ సెల్ ఫిర్యాదు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండుకు తరలిస్తున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: మేడారం వన దేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.