Knife Attack on Brothers: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో పండుగ వేళ చిన్నపాటి గొడవ.. కత్తిపోట్లకు దారి తీసింది. పాతకక్షల నేపథ్యంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే... స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌కు చెందిన తోకల తిరుపతి, కృష్ణ, బాలయ్య సోదరులు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న మరో నలుగురు అన్నదమ్ములతో ఆ కుటుంబానికి పాతకక్షలున్నాయి. శనివారం చిన్నపిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఇంట్లో రాళ్లుపడడంతో మాటామాట పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు. ముగ్గురికి తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వీరిలో తిరుపతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. కృష్ణ, బాలయ్య చికిత్స పొందుతున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఏఎస్పీ అన్యోన్య, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రామన్ పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి:యువతిని వెంబడించిన ఆకతాయి.. ఆ తర్వాత?