ETV Bharat / crime

అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. పోలీసుల గాలింపు - telangana latest news today

గురువారం అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్‌ జగిత్యాల మెహబూబాపురాలో కలకలం రేపింది. దుండగులు కత్తులతో బెదిరించి కారులో యువకున్ని ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతని జాడ కోసం వెతుకుతున్నారు.

Kidnapping of a young man in the midnight at jagtial
అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. పోలీసుల గాలింపు
author img

By

Published : Feb 12, 2021, 1:57 AM IST

జగిత్యాల మెహబూబాపురాలో ఆమెర్ అనే యువకున్ని గురువారం అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు అపహరించుకుపోయారు. కారులో యువకుడి ఇంటికి చేరుకున్న నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కత్తులతో బెదిరించి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు.

అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్.. పోలీసుల గాలింపు

బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100కు ఫోన్​ చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కిడ్నాప్​ను ఛేదించేందుకు అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

కోరుట్లకు చెందిన ఓ యువతి, జగిత్యాలకు చెందిన ఇర్ఫాన్ ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ కనిపించకపోవడం వల్ల యువతికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇర్ఫాన్ సోదరుడు ఆమెర్​ను కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.