ETV Bharat / crime

KIDNAP: నిజామాబాద్​లో కిడ్నాప్​ కలకలం.. సినీఫక్కీలో దుండగులను పట్టుకున్న పోలీసులు - Kidnapers arrest in bodhan

నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్​ కలకలం రేపింది. ఓ వ్యాపారి కుమారుడిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. కానీ అత్యాశే వారిని జైలు పాలు చేసింది. మాస్టర్ ప్లాన్ వేసినా.... నిజామాబాద్ పోలీసుల ఎంట్రీతో అట్టర్ ఫ్లాప్ అయింది.

KIDNAP
KIDNAP
author img

By

Published : Jul 28, 2021, 2:26 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో డబ్బుకోసం వక్తిని కిడ్నాప్​ చేసిన ఘటన కలకలం రేపింది. కత్తితో బెదిరించి.. వ్యాపారి కుమారుడు ముంతాజ్​ను దుండగులు ఎత్తుకెళ్లారు. యువకుడిని కిడ్నాప్ చేసిన నలుగురు చివరికి పోలీసులకు చిక్కారు.

KIDNAP
బాధితుడు ముంతాజ్..

అసలేం జరిగిందంటే...

నిజామాబాద్​లో సినీ ఫక్కీలో ఓ కిడ్నాప్​ జరిగింది. నలుగురు వ్యక్తులు డబ్బు కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ముందుగా బోధన్​లో వ్యాపారి కుమారుడి ముంతాజ్ని​ కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశారు. ఇంకేముంది అనుకున్నట్లే... కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. పట్టణ శివారులోని దాబా వద్దకు తీసుకెళ్లి.... విశ్వ అనే వ్యక్తికి రూ. 2 లక్షల రూపాయలివ్వాలని ముంతాజ్ సోదరుడికి సమాచారం అందించారు. వారు చెప్పిన ప్రకారం బాధితులు డబ్బులు ముట్టచెప్పారు.

KIDNAP
నిజామాబాద్​లో కిడ్నాప్​ కలకలం

అత్యాశకు పోయిన కిడ్నాపర్లు... రెండు లక్షలతో ఆగకుండా... మళ్లీ మూడు చెక్కులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.... బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కిడ్నాపర్లకు చెక్కులను అందిస్తుండగా దాడి చేసి నలుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 2లక్షల రూపాయలు, మూడు సెల్ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

25న ముంతాజ్​ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం వచ్చింది. డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా బాధిత కుటుంబం 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అయినా అత్యాశకు పోయి... మళ్లీ డబ్బులు కావాలని అడిగారు. వాళ్లు మమ్మల్ని ఆశ్రయించగా... వారిని పట్టుకున్నాం. వారిని రిమాండ్​కు తరలించాం.

ఎన్.రామారావు, ఏసీపీ బోధన్

నిజామాబాద్​లో కిడ్నాప్​ కలకలం

ఇవీ చూడండి:

girl kidnap case: బాలిక అపహరణ, లైంగిక దాడి ఘటనలో నిందితుడు అరెస్ట్‌

చిన్నారి కిడ్నాప్​.. అరగంటలో ఛేదించిన పోలీసులు

KIDNAP: ప్రేమ పేరుతో నయవంచన.. నిలదీసినందుకు ప్రియురాలు కిడ్నాప్!

kidnap case: కుమారుడిలా ఉన్నాడని కిడ్నాప్‌.. 4 నెలల తర్వాత అరెస్ట్

KIDNAP: కిడ్నాప్ కేసులో బాధితుడిని వదిలేసిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.