ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కారుపై గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో అతని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
అనిల్.. సోమవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 15లోని తన నివాసానికి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ఆయన కారుపై రాళ్లు విసిరారు. ఆగంతకుల దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న అనిల్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : నిజామాబాద్లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం