కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో.. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 9.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.
గంగాధరలో నిఘా పెట్టిన పోలీసులు.. ఒడిశాకు చెందిన వ్యక్తులు ఆర్టీసీ బస్సు దిగటంతో సోదా చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్టు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ సారధి వెల్లడించారు.
ఇదీ చూడండి: కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం