ETV Bharat / crime

robbery: జ్యువెలరీ షాపులో చోరీ... ఏం ఎత్తుకుపోయారంటే..! - వాసవి జ్యువెలర్స్​లో చోరీ

మంచిర్యాల జిల్లా కేంద్రం గంగ రోడ్డులోని శ్రీ వాసవి జ్యువెలరీ దుకాణంలో (jewellery shop robbery ) చోరీ జరిగింది. సుమారు రూ.30 లక్షల విలువైన వెండి ఆభరణాలు... దుండగులు ఎత్తుకెళ్లారని దుకాణ యజమాని పేర్కొన్నాడు.

jewelry shop robbery
jewelry shop robbery
author img

By

Published : Aug 23, 2021, 3:34 PM IST

జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన దుండగులు రూ. 30లక్షల విలువైన 50 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారు (robber in jewellery shop y). ఈఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో (mancherial) జరిగింది. గంగరోడ్డులోని శ్రీవాసవి జ్యువెలరీ షాపు యజమాని ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో దుకాణం మూసి వెళ్లాడు. ఈ రోజు ఉదయం షాపు తెరిచి చూసేసరికి దుకాణం వెనుకవైపు ఉన్న షట్టర్​ పగలగొట్టి ఉంది.

షాపులో ఉంచిన 50 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల వైర్లను కట్​చేసి... ఫుటేజ్​ బాక్సులను కూడా దుండగులు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​ క్లూస్​టీంతో వచ్చి పరిశీలించారు.

ఉదయం షాపు తెరిచి చూసేసరికి అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. వెనుకవైపు ఉన్న షట్టర్​ పగలగొట్టి చొరబడ్డారు. వెండిసామాను ఎత్తుకెళ్లిపోయారు. సుమారు రూ. 25 నుంచి 30 లక్షల విలువైన 40 నుంచి 50 కిలోల వెండి సామాను అపహరించారు. ఖండేలాల్​, దుకాణ యజమాని

ఇదీ చూడండి: BUSSES ACCIDENT: రెండు బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.