ETV Bharat / crime

35 చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్​ - mahaboobnagar district latest news

తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడిన ఓ పాత నేరస్థున్ని జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 3.62 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Jedcharla police have arrested  accused of theft.
35 చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్​
author img

By

Published : Mar 21, 2021, 5:08 AM IST

2009 నుంచి వివిధ జిల్లాల్లో 35 చోరీలకు పాల్పడి విజయ్ కుమార్ అలియాస్ చిన్నను మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు జైలు శిక్ష అనుభవించిన ఇతను గత ఏడాది డిసెంబర్ 3న జైలు నుంచి విడుదలయ్యడు. ఫిబ్రవరి 22న, ఈనెల 10న జడ్చర్లలోని విద్యానగర్, విజయనగర్ కాలనీల్లోని రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మరోమారు చోరీ చేసే ఉద్దేశంతో జడ్చర్లకు రాగా వేలిముద్రల ఆధారంగా ఎస్సై విజయప్రసాద్ బృందం గుర్తించారు.

విజయ్ కుమార్ నుంచి రూ. 3.62 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న విజయప్రసాద్ బృందానికి డీఎస్పీ నగదు పురస్కారాలను అందజేశారు.

ఇదీ చదవండి: స్విమ్మింగ్​పూల్​లో మునిగి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.