ETV Bharat / crime

రెండోరోజు ముగిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణ - ED case against JC Prabhakar Reddy latest news

JC Prabhakar Reddy on ED Enquiry: జేసీ ప్రభాకర్ రెడ్డి రెండోరోజు ఈడీ విచారణ ముగిసింది. సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. బీఎస్‌-3 వాహనాల కొనుగోళ్లపై జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది.

ED officials are investigating JC Prabhakar Reddy On the second day in the vehicle purchase scam
వాహనాల కొనుగోలు స్కామ్‌.. రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
author img

By

Published : Oct 8, 2022, 10:37 AM IST

Updated : Oct 8, 2022, 10:31 PM IST

JC Prabhakar Reddy on ED Enquiry: వాహనాల కొనుగోలు వ్యవహారంలో వరుసగా రెండోరోజు తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా 10 గంటల పాటు దివాకర్‌రెడ్డిని ఈడీ విచారించింది. బీఎస్‌-3 వాహనాల కొనుగోలు విషయంలో ఈడీ తనను విచారించినట్టు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మనీ లాండరింగ్‌, హవాలా జరిగిందా లేదా అనేది దర్యాప్తు సంస్థ తేలుస్తుందన్నారు.

ఇప్పటికే తన సంస్థ మూసివేసినట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్‌ వాహనాలున్నాయని ఆయన చెప్పారు. నాగాలాండ్​లోనూ అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎప్పుడు ఈడీ విచారణకు పిలిచినా.. తాను హాజరై అధికారులకు పూర్తిగా సహకరిస్తానని ప్రభాకర్‌రెడ్డి వివరించారు.

అసలేెం జరిగిదంటే: గతంలో ఏపీ రవాణా శాఖ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్​లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి వాహనాలను రెండు కంపెనీలకు తుక్కు కింద కొనుగోలు చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని నాగాలాండ్​లో బీఎస్-4 వాహనాల కింద రిజిస్ట్రేషన్ చేయించి.. ఏపీకీ బదిలీ చేయించారని రవాణా శాఖ అధికారులు అందులో తెలిపారు.

ఇందుకోసం నకిలీ ధ్రువపత్రాలను సృష్టించినట్లు రవాణా శాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. రెండేళ్ల క్రితం రవాణా శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీ సోదరులపై కేసు నమోదు చేశారు. పోలీసు కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే జూన్ 17న అనంతపురం తాడిపత్రిలోని జేసీ సోదరుల నివాసాలతో పాటు హైదరాబాద్​లోనూ సోదాలు నిర్వహించారు. జేసీ సోదరుల చరవాణిలతో పాటు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.