బ్యాంక్, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఝార్ఖండ్ రాష్ట్రం జాంతారకి చెందిన ముఠాను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. కేవైసీ అప్డేట్, ఫేక్ కస్టమర్ కేర్, క్రెడిట్, డెబిట్ కార్డుల పేరుతో ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడింది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఈ ముఠాపై 50 కేసులు నమోదు కాగా... రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 263 కేసులు నమోదయ్యాయి.
నిందితులను పట్టుకునేందుకు ఝార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్పెషల్ టీం.. నిందితులు బీరేందర్ మండల్, సంజీత్ కుమార్, సందీప్ మండల్, చోటు కుమార్ మండల్, రంజీత్ మండల్, సుశీల్ కుమార్ మండల్, పవన్ మండల్, వికాస్ కుమార్ మండల్, మహేందర్ మండల్, రాజ్ కిశోర్ మండల్, టింకు కుమార్ మండల్, రవి కుమార్ మండల్‌గా గుర్తించారు. ఈ 12 మంది ముఠాను పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి..
తిరుపతి రైల్వేస్టేషన్ లక్ష్యంగా పోస్టులు.. ఇద్దరు ఆర్మీ అభ్యర్థుల అరెస్ట్..!
సూదిని మింగిన పిల్లి.. గొంతులో అడ్డుపడి నరకం.. సర్జరీ తర్వాత...