ETV Bharat / crime

Inter Student Suicide : ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదేనా..! - గౌడిదొడ్డిలో ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

Inter Student Suicide: హైదరాబాద్‌ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి పుస్తకాల సంచిలో పోలీసులకు రెండు ఆత్మహత్య లేఖలు లభించాయి.

Suicide
Suicide
author img

By

Published : Feb 20, 2022, 11:45 AM IST

Inter Student Suicide : హైదరాబాద్‌ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మయ్య-సువర్ణ దంపతుల రెండో కుమారుడు వంశీకృష్ణ(17) ఇక్కడ బైపీసీ(ప్రథమ) చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు హాస్టల్‌లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకుని, తర్వాత నిద్రపోయాడు. శనివారం ఉదయం తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు.

దీనిపై ప్రిన్సిపల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి పుస్తకాల సంచిలో పోలీసులకు రెండు ఆత్మహత్య లేఖలు లభించాయి. ఒకటి తెలుగులో ఉంది. అందులో.. ‘నేను లైంగికంగా వేధించబడ్డా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని, ఆంగ్లంలో రాసిన మరో లేఖలో ‘బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. కుమారుడి మరణ వార్త తెలుసుకొన్న తల్లిదండ్రులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

ఇదీ చూడండి : Fire Accident: పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చిన తోటి విద్యార్థి తుంటరి పని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.