ETV Bharat / crime

Inter student Suicide Jeedimetla : బలవంతంగా చదవలేనని.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య - తెలంగాణ వార్తలు

Inter student Suicide Jeedimetla : తనకు ఇష్టం లేని చదువును బలవంతంగా చదవలేనని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సుభాష్ నగర్​లో జరిగింది.

Inter student Suicide, jeedimetla suicide
ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jan 4, 2022, 10:00 AM IST

Inter student Suicide Jeedimetla : తనకు ఇష్టం లేని చదువును.. బలవంతంగా చదవలేనని ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌ హనుమాన్‌ ఆలయం సమీపంలో నివాసముండే బాలుడు(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

కొన్ని రోజులుగా.. తల్లిదండ్రులతో తనకు చదవడం ఇష్టం లేదని చెబుతున్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. ఈ క్రమంలోనే.. అతడు సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతిపై వివరాల్ని ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు చెప్పారు.

ఇదీ చదవండి: Bitcoin Cyber crime in Hyderabad : 'బిట్‌కాయిన్స్‌ పంపించకుంటే నీ భార్య మార్ఫింగ్‌ ఫొటోలు వైరల్‌ చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.