ETV Bharat / crime

గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​ - telangana crime news

Ganja Smugglers: మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్​చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్​రెడ్డి వెల్లడించారు. 4 కిలోల 130 గ్రాముల గంజాయి, రూ.1.85 లక్షల నగదు, కార్లు,చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

inter state ganja smugglers
inter state ganja smugglers
author img

By

Published : Apr 6, 2022, 12:06 PM IST

Ganja Smugglers: గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్​ చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్​రెడ్డి వెల్లడించారు. ఈనెల 4న మహదేవపూర్​ పోలీసులు లక్ష్మి బ్యారేజ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారని ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో రెండు కార్లలోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. తమ సిబ్బంది వెంటనే తనిఖీలు చేయగా.. 4 కిలోల 130 గ్రాముల గంజాయి, రూ.1.85 లక్షల నగదు కనిపించాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

ఒడిశాలోని కలిమెల నుంచి మహదేవపూర్ మీదుగా మహారాష్ట్రలోని జౌరంగబాద్​కు గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించామని ఎస్పీ సురేందర్​రెడ్డి పేర్కొన్నారు. నిందితులు కాలె కృష్ణ, జౌరంగబాద్​కు చెందిన కాలె విజయ్, దబడె గోపాల్, సప్కాల్ మయూర్​గా గుర్తించామన్నారు. గంజాయితో పాటు కార్లు, చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.

inter state ganja smugglers
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, నగదు, ఫోన్లు, నంబర్​ ప్లేట్లు

ఇదీచూడండి: ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్టు వారెంట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.