ETV Bharat / crime

స్వాహాలో కొత్తపంథా... గతంలో చనిపోయిన వారి పేర్లతో దందా

Insurance Money Stolen with False Death certificates: ఎప్పుడో చనిపోయిన వ్యక్తుల పేరిట మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోట్లు కాజేస్తున్న ఉదంతం... ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. అక్రమార్కులతో... కార్మికశాఖ సిబ్బంది, ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కుమ్మకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్వాహాలో కొత్తపంథా... గతంలో చనిపోయిన వారి పేర్లతో దందా
BEEMA SWAHA
author img

By

Published : Oct 14, 2022, 1:40 PM IST

Insurance Money Stolen with False Death certificates: ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన చిలకా బ్రహ్మయ్య 2013లో మరణించారు. ఈయన స్మారకార్థం గ్రామంలో రహదారి పక్కన సమాధి నిర్మించారు. బ్రహ్మయ్య చనిపోయి తొమ్మిదేళ్లు దాటింది. కానీ.. బ్రహ్మయ్య 2019లో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి... మరోసారి మరణ ధ్రువీకరణ పత్రం పొందారు.

ఈ తప్పుడు పత్రంతో కార్మిక శాఖ నుంచి... ఈ ఏడాదిలో లక్షా 30 వేల బీమా సొమ్ము పొందారు. సొమ్ములో కుటుంబీకులకు సగం, మిగిలిన సొమ్ము దళారులు నొక్కేశారు. ఈ ఒక్కటే కాదు.. వందల సంఖ్యలో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో... ప్రభుత్వం అందించే బీమా సొమ్ము కాజేస్తున్నారు. జిల్లాల్లోని అనేక గ్రామాల్లో మృతిచెందిన వారి వివరాలు అక్రమార్కులు సేకరిస్తున్నారు. మృతుల కుటుంబీకులకు ఎంతోకొంత ఇస్తామని ఆశ చూపుతున్నారు.

బీమా దరఖాస్తులను పరిశీలించి... క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సిన అధికారుల్లో కొంతమంది.. దళారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. దళారుల ద్వారా వెళ్తేనే పని జరుగుతోందని.. వ్యక్తిగతంగా ఏళ్ల నంచి తిరిగినా.. కార్మికశాఖ సిబ్బంది పట్టించుకోవడం లేదని కొందరు బాధితులు వాపోతున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బీమా సొమ్ము స్వాహా చేస్తున్న దళారులు.. మృతుల నామినీల ఏటీఎం కార్డులను వారి వద్దే ఉంచుకుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీమా పేరిట స్వాహా పర్వం వ్వవహారం కార్మికశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బీమా సొమ్ము కాజేసిన వ్యవహారంపై... కార్మికశాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో చోటుచేసుకున్న స్వాహా పర్వంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

స్వాహాలో కొత్తపంథా... గతంలో చనిపోయిన వారి పేర్లతో దందా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.