ETV Bharat / crime

'ప్రసవం కోసం వస్తే.. నిర్లక్ష్యంతో మృత శిశువును ఇచ్చారు'

అమ్మతనం కోసం ఆరాటపడిన ఆ మహిళకు గర్భశోకమే మిగిలింది. బిడ్డకోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తే... తీరా మృత శిశువుని చూడాల్సి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.

infant dead while surgery, yadadri bhuvanagiri district hospital
ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి, వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
author img

By

Published : May 12, 2021, 5:30 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పురిట్లోనే పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మోటకొండూర్​కి చెందిన నవ్యను ప్రసవం కోసం ఆస్పత్రికి సోమవారం తీసుకువచ్చినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ ప్రసవం అవుతుందని వైద్యులు అన్నారని పేర్కొన్నారు. శస్త్ర చికిత్స చేయాలని కోరినా వైద్యులు నిర్లక్ష్యం వహించారని వాపోయారు.

బుధవారం ఉదయం నవ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. శస్త్ర చికిత్స నిర్వహించేలోపే శిశువు మృతి చెందిందని తెలిపారు. ప్రసవం కోసం వస్తే మృత శిశువును అప్పగించారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యుల వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: కత్తులతో దాడి చేసి.. బండరాయితో మోది చంపారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.