ETV Bharat / crime

ఏటీఎంలో సాయం పేరుతో మోసం... 2 లక్షలు కాజేసిన కేటుగాడు - mulugu district crime news

ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి సాయం అడిగిన వృద్దున్ని మోసం చేశాడు ఓ యువకుడు. సహాయం చేస్తున్నట్లుగా నటింటిన కేటుగాడు కార్డు వివరాలు తెలుసుకుని రూ. 2 లక్షలను కాజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

young man cheating on an old man at an ATM
వృద్ధున్ని మోసం చేసిన యువకుడు
author img

By

Published : May 20, 2021, 6:10 PM IST

ములుగు జిల్లాలో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చిన వృద్దుడిని ఓ యువకుడు బురిడీ కొట్టించాడు. అతడికి సహాయం చేస్తున్నట్లుగా నటించి రూ. 2 లక్షలను కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీలో నమోదైన వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కొయ్యల లాలయ్య అనే నిరక్షరాస్యుడు ఏప్రిల్ 20న ఉదయం 11 గంటలకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం వద్దకు వచ్చాడు. డబ్బు డ్రా చేసేందుకు అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని సాయం కోరాడు. ఇదే అదునుగా భావించి ఏటీఎం పిన్ నెంబర్​ను తెలుసుకున్న ఆ వ్యక్తి సుమారు రూ. 2 లక్షలను డ్రా చేసుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వివరాలు తెలిసిన వారు పోలీసులుకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.