ETV Bharat / crime

CYBER CRIME: ఇటలీలో డాక్టర్​నన్నాడు... రూ. 50 లక్షలు నొక్కేశాడు..

సైబర్ క్రైం నేరాలు ఇంతింతా కాదయా అనేంతగా పెరిగిపోతున్నాయి. పెళ్లి పేరుతో.. ఈవెంట్ పేరుతో... పెట్టుబడి పేరుతో.. ఇలా పేరు ఏదైనా... సైబర్ నేరగాళ్ల వాడకం మాములుగా ఉంటట్లేదు..! కొత్త కొత్త మార్గాల్లో కేటుగాళ్లు రూ.లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఇలాగే రెండో పెళ్లిపేరుతో ఓ మహిళని మోసం చేయగా.. మరో మూడు సైబర్ నేరాలకు పాల్పడ్డారు.

author img

By

Published : Jun 20, 2021, 11:20 AM IST

CYBER CRIME: రెండో పెళ్లి పేరుతో మహిళ నుంచి రూ. 50 లక్షలు స్వాహా
In Hyderabad cyber criminals extorted fifty lakhs were stolen

రెండో పెళ్లి పేరుతో సైబర్ నేరగాళ్లు (CYBER CRIME) భారీ మోసానికి తెగపడ్డారు. రూ. 50 లక్షలను ఓ మహిళ వద్ద కాజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​కు చెందిన ఓ మహిళ రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుంది. కొన్ని రోజుల తరువాత తనకు ఓ ఫోన్ వచ్చింది. 'తాను ఇటలీలో డాక్టర్​నని, క్లినిక్ కూడా ఉందన్నాడు. మాట్రిమోనీ సైట్​లో ప్రొఫైల్ చూశానని... మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్​లోనే స్థిరపడదామని కేటుగాడు ముగ్గులోకి లాగాడు.

కొన్ని రోజుల తరువాత ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులు ఎయిర్ కొరియర్ ద్వారా పంపిస్తున్నానని నమ్మించాడు. పథకం ప్రకారం ఓ మహిళ చేత దిల్లీ కస్టమ్స్ అధికారినంటూ ఫోన్ చేయించాడు. వస్తువుల కోసం టాక్స్​లు చెల్లింపు పేరుతో రూ.50 లక్షలను కేటుగాడు బదిలీ చేయించుకున్నాడు. తరువాత ఫోన్ చేయగా అటువైపు నుంచి సమాధానం రాలేదు. చివరికి మోసపోయినని తెలుసుకున్న ఆ మహిళ... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈవెంట్ పేరుతో..

ప్రముఖ డ్యాన్సర్ రాఫ్తార్​ను ఈవెంట్ షోకి రప్పిస్తానని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తిరుమలగిరికి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసన్నను నమ్మించి రూ.10 లక్షలను సైబర్ కేసుగాళ్లు కాజేశారు.

సిమ్ కార్డుతో, డైమండ్ బిజినెస్ పేరుతో..

కొత్త సిమ్ కార్డు ద్వారా ఒక ప్రైవేట్ సంస్థ మేనేజర్ తులసీ బాబుకు చెందిన మూడు క్రెడిట్ కార్డుల నుంచి.. ఐదున్నర లక్షల రూపాయాలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. అలాగే డైమండ్స్ బిజినెస్​లో పెట్టుబడుల పేరుతో గౌలిగూడకు చెందిన యువకుడు హరీష్ చౌదరిని నమ్మించి సైబర్ కేటుగాళ్లు 6 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద చూడండి: Rajnikanth: రజనీకాంత్ స్టైల్ వెనుకున్న సీక్రెట్ ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.