ETV Bharat / crime

నాణ్యత లేని శానిటైజర్లు స్వాధీనం.. అదుపులో నిందితులు

author img

By

Published : May 14, 2021, 8:38 PM IST

నాణ్యత లేకుండా తయారుచేసిన శానిటైజర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్​లోని మట్టెవాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. శానిటైజర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

illegal sanitizers seized
నాణ్యత లేని శానిటైజర్లు స్వాధీనం

వరంగల్ అర్బన్​ జిల్లా మట్టెవాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నాణ్యత లేకుండా అమ్ముతున్న 432 లీటర్ల శానిటైజర్, ఖాళీ సీసాలను వరంగల్ టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్​కి తరలించారు.

మట్టెవాడ పోలీస్​స్టేషన్ పరిధిలోని జేపీ‌ఎన్ రోడ్, జెమిని థియేటర్ లైన్లలో 5 షాపులపై టాస్క్​ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ షాపుల్లో నాణ్యత లేని శానిటైజర్లను క్యాన్లలో నుంచి ఖాళీ స్ప్రే బాటిళ్లలో నింపుతుండగా పట్టుకున్నారు. డబ్ల్యూహెచ్​ఓ నియమాలను పాటించకుండా వాటిని తయారుచేసి అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు. వాటిని బయట అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. ఈ తనిఖీల్లో టాస్క్​ఫోర్స్ సీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ట్యాంక్​బండ్ ​అంబేడ్కర్​ విగ్రహం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.