లాక్ డౌన్‌తో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మద్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉదయం 10 గంటలలోపే మద్యం కొని నిల్వ చేసుకుని… తర్వాత అధిక ధరలకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్మూర్ ఎక్సైజ్ సీఐ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు.
మొత్తం 48 బీర్లు, 12 లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 15 వేల వరకు ఉంటుందని సీఐ రఘునాథరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి, మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సీఐ వెంట ఎస్సై జగన్మోహన్, హెడ్ కానిస్టేబుల్ అక్షయ్, కానిస్టేబుళ్లు సాయిలు, వికాస్ ఉన్నారు.