ETV Bharat / crime

pending challans vehicle seize: ఆ బైక్​ అమ్మేసినా.. దానిపై ఉన్న చలానా మొత్తం రాదేమో..! - hyderabad latest news

ఓ ద్విచక్ర వాహనదారుడి వాహనానికి 117 చలాన్లు ఉండడటంతో ట్రాఫిక్‌ పోలీసులు (hyderabad traffic police) అవాక్కయ్యారు. 30వేల విలువైన చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ హోండా యాక్టివా వాహనాన్ని సీజ్ చేశారు (pending challans vehicle seize).

pending challans vehicle seize
pending challans vehicle seize
author img

By

Published : Nov 16, 2021, 4:34 PM IST

చాలా మంది వాహనచోదకులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్​ చేయడం, నంబర్ ప్లేట్​ను తీసివేయడం, తప్పుడు ప్లేట్​ను ఉపయోగించడం, సిగ్నల్​ పట్టించుకోకపోడం తదితరాలు చేస్తుండడం చూస్తున్నాం. అలా చలాన్లు కట్టకుండా తప్పించుకొని తిరురుగుతున్న ద్విచక్ర వాహన దారుడు మహ్మద్ ఫరిద్ ఖాన్ చివరికి ఇలా చిక్కాడు.

హైదరాబాద్​ కలెక్టర్​ కార్యాలయం ఎదురుగా తనిఖీలు చేస్తున్న అబిడ్స్​ పోలీసులు (hyderabad traffic police) ఓ యాక్టివా వాహనాన్ని ఆపారు. ఆ వాహనంపై ఏమైన చలాన్లు ఉన్నాయోమోనని తనిఖీ చేయగా.. పెండింగ్​ చలాన్లు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మెషీన్​ ఏమైనా పాడైపోయిందా అని చెక్​ చేసుకున్నారు. లేదు అవన్నీ ఆ వాహనంపై ఉన్న పెండింగ్​ చలాన్లేనని నిర్ధరించి.. అవాక్కయ్యారు (pending challans vehicle seize). ఆ బైక్​పై ఒకటా రెండా.. ఏకంగా 117 చలాన్లు పెండింగ్​లో ఉన్నాయి మరి. 177 పెండింగ్​ చలాన్లు ఉన్న హోండా యాక్టివాను పోలీసులు సీజ్​ చేశారు. వాటి విలువ మొత్తం రూ.30 వేలు పెండింగ్​లో ఉన్నట్లు గుర్తించారు.

పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టి

ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టిసారించారు. కూడళ్లలో వచ్చే పోయే ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే ఆపి చలానాలు తనిఖీ చేస్తున్నారు. వీలైనంత వరకు అక్కడికక్కడే చలానా వసూలు చేస్తున్నారు. వేయి రూపాయల కంటే ఎక్కువ బాకీ ఉంటే వాహనదారులు ఖచ్చితంగా మీ-సేవలో కానీ, ఆన్​లైన్లో కానీ పేమెంట్ చేసినట్లుగా చూపిన తరువాతే వాహనం అప్పగిస్తున్నారు.

ప్రమాదం వెన్నంటే..

కొద్దిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు బైకులు, కార్లు, ఇతర వాహనదారులపై నిఘా పెట్టారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లే వారి డ్రైవింగ్‌ను, ఫోన్‌లో మాట్లాడకుండా వెళ్తున్నవారి డ్రైవింగ్‌ను పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న కొన్ని అంశాలను గమనించారు.

నగరంలోని 85 ప్రధాన కూడళ్ల వద్ద కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పరిశీలించారు. ద్విచక్రవాహనదారుల్లో 70 శాతం మంది ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు.

  • ఈ ఉల్లంఘనులు ఎక్కువ ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, కోఠి, మలక్‌పేట, జూబ్లీహిల్స్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఠాణాల పరిధుల్లోనే కనిపిస్తున్నారని గుర్తించారు.
  • వాహనం నడిపేప్పుడు ఫోన్‌ మోగగానే..బైక్‌, స్కూటీలపై వెళ్తున్నవారు వెనక, ముందూ ఆలోచించకుండా ఎత్తుతున్నారు. వాహనవేగం తగ్గి, వెనక వచ్చే వారు ఢీకొంటున్నారు. మరికొందరు ఒకచేత్తోనే వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు సరిగా వినిపించకపోవడంతో ఫోన్‌ దగ్గరగా పట్టుకొనే ప్రయత్నంలో యాక్సిలేటర్‌ గట్టిగా లాగుతున్నారు. ముందు వాహనాలను ఢీకొంటున్నారు.

ఏడాది జైలు.. రూ.5 వేల జరిమానా

ఇకపై కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టాన్ని ఉల్లంఘనులపై ప్రయోగించాలనుకుంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. చరవాణిలో మాట్లాడుతూ వెళ్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. కోర్టు వీరికి రూ.5 వేలు జరిమానాతో పాటు ఏడాదిపాటు జైలుశిక్ష విధించనుంది. వాహనాలను నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్లను కేవలం గమ్యస్థానాలకు దారి చూపేందుకు మాత్రమే వినియోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించడంతో ట్రాఫిక్‌ పోలీసులు జైలు, జరిమానా అంశంపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఇదీ చూడండి: ఒకే వాహనానికి 54 చలాన్లు పెండింగ్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.