ETV Bharat / crime

డార్క్​నెట్​పై ఫోకస్​.. డ్రగ్స్​ వినియోగదారుల్లో వారే అధికం: సీపీ ఆనంద్​ - drugs gang arrest

Drugs Addicted Students Arrest: భాగ్యనగరంలో డ్రగ్స్​ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట.. డ్రగ్స్​ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న వారిలో విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రధానంగా డార్క్​నెట్​​ ద్వారా డ్రగ్స్​ సరఫరా జరుగుతుందన్న విషయాన్ని గుర్తించిన నార్కోటిక్​ అధికారులు.. ఎట్టకేలకు మూడు గ్యాంగ్​లను అరెస్ట్ చేశారు. విద్యార్థులు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే అధికంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​ ఆందోళన వ్యక్తం చేశారు.

drugs addict students arrest
డ్రగ్స్​ విద్యార్థులు అరెస్ట్​
author img

By

Published : Feb 26, 2022, 3:05 PM IST

Drugs Addicted Students Arrest: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న మూడు ముఠాలను నార్కోటిక్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. డార్క్‌నెట్‌లో నిఘా పెట్టిన నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్.. డ్రగ్స్ వ్యవహారాన్ని బయట పెట్టిందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. నిందితుల్లో సాఫ్ట్​వేర్ ఉద్యోగులు, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారని సీపీ తెలిపారు. విద్యార్థులకు ఇదివరకు మానవీయ కోణంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టామని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్పు రాకుండా మళ్లీ డ్రగ్స్ తీసుకుంటున్నారని.. అందుకే విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తున్నామని సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. నిందితుల్లో యువతులు కూడా ఉన్నారని చెప్పారు.

విక్రయదారుల్లో వారే అధికం

డార్క్‌నెట్ ద్వారా వినియోగదారులు డ్రగ్స్ తెప్పిచుకుంటూ పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు గుర్తించామని.. వీటిని పోస్టు, కొరియర్‌ ద్వారా తెప్పించుకుంటున్నారని తెలిపారు. పట్టుబడిన ముఠాలో నైజీరియన్ ఉన్నాడని.. ఆ దేశస్థులు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. వీసా గడువు తీరినా ఇక్కడే ఉంటున్నారని.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్‌ తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లు కార్పొరేట్ కంపెనీలో మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ విద్యాలయాల్లో కొంత మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ఆయా యూనివర్శిటీల దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు.

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీపీ సీవీ ఆనంద్​

కౌన్సిలింగ్​ ఇచ్చినా

'డార్క్‌నెట్‌ కార్యక్రమాలపై నిఘా పెట్టాం. పటిష్ఠ నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్‌ విభాగం అరెస్టు చేసింది. నిందితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, పీజీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉన్నారు. గతంలో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశాం. కానీ వాళ్లు మళ్లీ డ్రగ్స్​ వాడుతున్నారు. విద్యార్థులను హెచ్చరించినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్‌కు అలవాటైన వారే క్రమంగా సరఫరా చేస్తున్నారు. నైజీరియన్లే డ్రగ్స్‌, సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. వీసా గడువు తీరినా దేశంలో ఉంటూ అక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర సంస్థల దృష్టికి తీసుకెళ్లాం.' -సీవీ ఆనంద్​, హైదరాబాద్​ సీపీ

ఇదీ చదవండి: నిర్మానుష్య ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా.. ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.