ETV Bharat / crime

OLX Cheating News:ఓఎల్​ఎక్స్​లో వస్తువులు కొంటామంటూ.. అమాయకులకు టోకరా

ఓఎల్​ఎక్స్​లో వస్తువులు కొంటామంటూ (cyber crime ) అమాయకులను నమ్మించి మోసగించిన ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరు రాజస్థాన్​కు చెందిన అల్వార్​ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి.. చంచల్​గూడ జైలుకు రిమాండ్​కు పంపారు.

cyber crime news
cyber crime news
author img

By

Published : Oct 8, 2021, 7:31 PM IST

ఓఎల్​ఎక్స్​, ఫేస్​బుక్​ ద్వారా మోసాలకు పాల్పడుతున్న(cyber crime news)సైబర్ నేరగాళ్ల బృందాన్ని చంచల్​గూడ జైలులో రిమాండ్​కు తరలించారు.. పోలీసులు. ఓఎల్ఎక్స్​లో వస్తువులు కొంటామని అమాయకులను నమ్మించి.. బాధితుల ఖాతాలో నుంచి నగదు కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్​బుక్​ హ్యాక్​ చేసి.. అందులోని ఫ్రెండ్స్​కు రిక్వెస్ట్​లు పంపి నగదు వసూళ్లకు పాల్పడినట్లు తేల్చారు. ఈ ఘటనలపై సైబర్​క్రైం పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ ముఠాపై రాచకొండ కమిషనరేట్​ పరిధిలోనూ పలు కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితులు రాజస్థాన్​లోని అల్వార్​ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. రెండు నెలల క్రితం 12 మంది నిందితులను అరెస్ట్​ చేసి తీసుకువచ్చారు. అనంతరం జైలుకు పంపారు. అనంతరం కూకట్​పల్లి కోర్టులో పీటీ వారెంట్​ కోరారు. 12 మందిని కోర్టులో హాజరుపరిచి.. చంచల్​గూడ జైలుకు పంపారు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.