Fake certificate gang burst : నకిలీ పత్రాలతో ఆధార్‌కార్డులు మార్చుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గెజిటెడ్ అధికారుల పేరుతో నకిలీ స్టాంపులు తయారుచేసి... తప్పుడు సమాచారంతో ఆధార్‌కార్డులు మార్చుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు అసోం కేంద్రంగా ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకు దాదాపు 3వేల తప్పుడు ఆధార్‌కార్డులను సృష్టించారని వివరించారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. నిందితుల నుంచి నకిలీ పత్రాలు, ల్యాప్‌టాప్, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
'ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లను నకిలీ పత్రాలతో మార్చుతున్న రాకెట్ పట్టుబడింది. ఆధార్ కార్డులో మార్పులు చేయాలంటే దశల వారీగా తనిఖీలు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. వీరు దీన్ని అనధికారికంగా మార్చడానికి ప్రయత్నించారు. ఆధార్ కిట్లు, 6 ల్యాప్ టాప్‌లు, ఐరీస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ల్యాబ్స్, కెమెరాలు, స్టాంపులు, ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ పత్రాలు, 4 బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ గెజిటెడ్ ఆఫీసర్, రూ.80వేలు స్వాధీనం చేసుకున్నాం.'
-అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ
ఇదీ చదవండి: investment Fraud gang Arrested: పెట్టుబడుల పేరుతో చైనీయుల మోసాలు.. వారంలోనే రూ.2.42 కోట్లు!