ETV Bharat / crime

ఉమేశ్‌ను హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించని అహ్మదాబాద్‌ ఖాకీలు.. ఎందుకంటే? - హైదరాబాద్ క్రైమ్ వార్తలు

Most Wanted Chain Snatcher: మూడు కమిషనరేట్​ల పరిధిలో మోస్ట్ వాంటెడ్​గా ఉన్న గొలుసు దొంగ ఉమేశ్ అరెస్ట్ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. అతనిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్​ నుంచి అహ్మదాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడి నుంచి తిరిగి వచ్చేశాయి. అహ్మదాబాద్​లో చైన్ స్నాచింగ్ కేసులో ఉమేశ్​ను అక్కడి పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్యం అవుతుందని భావించిన రెండు ప్రత్యేక బృందాలు తిరుగు ప్రయాణమయ్యారు.

Most Wanted Chain Snatcher
Most Wanted Chain Snatcher
author img

By

Published : Jan 25, 2022, 9:27 AM IST

Most Wanted Chain Snatcher: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒకే రోజు ఐదు గొలుసు దొంగతనాలు చేసిన ఉమేశ్‌ ఖతిక్‌ ఇప్పట్లో అరెస్ట్ అయ్యేలా లేడు. అతడిని అరెస్ట్‌ చేసేందుకు 5రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం అహ్మదాబాద్ వెళ్లింది. అయితే ఉమేశ్‌ ఇంకా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. గుజరాత్‌లోనూ 50కిపైగా గొలుసు దొంగతనాలు చేయడంతో... అహ్మదాబాద్‌ పోలీసులు విచారిస్తున్నారు. అందుకే ఉమేశ్‌ను హైదరాబాద్ పోలీసులకు అప్పగించలేదు.

కర్ణాటకలో కూడా ఉమేశ్‌పై కేసులు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో అతడు బెంగుళూరు పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేశాడు. విలాసాలకు అలవాటు పడి అనంతరం దొంగగా మారాడు. ఉమేశ్‌ చేసిన చోరీల్లో అతడి భార్య కీలక పాత్ర పోషించింది. చోరీలు చేసే ముందు... ఆ తర్వాత ఖరీదైన హోటల్లో ఇద్దరూ బస చేయడం హాబీ అని పోలీసులు గుర్తించారు. ఉమేశ్‌ అరెస్ట్‌ ఆలస్యం అవుతుండటంతో రెండు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాయి. ఉమేశ్‌ను అహ్మదాబాద్‌ పోలీసులు రిమాండ్ చేసిన తర్వాత పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.