యజమాని నగదుతో పారిపోయిన ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 3న మాదాపూర్‌లో అపహరణకు గురైన నగదు కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపార భాగస్వాములైన ధీరజ్ రెడ్డి, వై.ఎస్.ప్రసాద్, ఎంఎన్‌బీ రాజు ఈనెల మూడో తేదీన సాయంత్రం వైఎస్ ప్రసాద్ కారులో మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్ వద్దకు వచ్చారు. కారులో నగదు ఉంచి ముగ్గురు మాల్ లోనికి వెళ్లారు. తిరిగొచ్చి చూసేసరికి కారుడ్రైవర్, కారులో నగదు కనబడలేదు. ఈ వియయమై కారు యజమాని వైఎస్ ప్రసాద్... మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైఎస్ ప్రసాద్ దగ్గర మహారాష్ట్రకు చెందిన హనుమంతు ధోత్రే రెండు నెలల కిందట డ్రైవర్‌గా చేరాడు. అతడే నగదు అపహరించాడని ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. నిందితుడు హనుమంతు ధోత్రే అతని సోదరుడు లక్ష్మణ్ ధోత్రేను సిగ్నల్ ఆధారంగా అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40,50,000 నగదు స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఏటీఏంలో అగ్ని ప్రమాదం..రూ.13.30 లక్షల ఆస్తి నష్టం