ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని... హైదరాబాద్ సైబర్ క్రైెెం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన శివ కుమార్ అనే వ్యక్తి... ఆన్లైన్లో యాడ్ చూసి ఉద్యోగం కోసం నిందితుడిని సంప్రదించాడు. ఉద్యోగం పొందాలంటే ముందుగా రూ.50 వేలు చెల్లించాలని చెప్పడంతో... బాధితుడు ఆన్లైన్ ద్వారా డబ్బులను పంపించాడు.
ఆ తరువాత వారు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పశ్చిమ బంగాల్లోని కోల్‌కతాకు చెందిన హర్షవర్ధన్ మిశ్రా అనే వ్యక్తి కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు మూడు వేల మందిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఐటీఐఆర్ రాకపోవడానికి కారణం తెరాసనే: బండి సంజయ్