ETV Bharat / crime

రుణ యాప్​ల కేసులో మరో ముగ్గురు అరెస్ట్ - లోన్​యాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్

Three Accused Arrested In Loan App Case: రుణ యాప్​ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి కొరడా ఝళిపించారు.డొల్ల కంపెనీలు స్థాపించి చైనా రుణ యాప్‌లకు సహకరించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీని వెనక ఇంకెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Three accused arrested in loan app case
Three accused arrested in loan app case
author img

By

Published : Nov 10, 2022, 1:09 PM IST

Three Accused Arrested In Loan App Case: రుణ యాప్​ల కేసులో మరో ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దిల్లీకి చెందిన శ్యాయ్‌సింగ్ , ధీరజ్, గుజరాత్ నివాసి పంకజ్ ప్రజాపతిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు. శ్యామ్ సింగ్, ధీరజ్ డొల్ల ఫిన్‌టెక్ కంపెనీలను స్థాపించారని చెప్పారు. చైనాకు చెందిన ఆన్​లైన్​పెట్టుబడులు, రుణ యాప్‌లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు ఇచ్చి అందుకు కమీషన్ తీసుకుంటారని పోలీసులు తెలిపారు.

పంకజ్ ప్రజాపతి రుణ యాప్​ల నిర్వహణకు సహకరించేవాడని పోలీసులు వెల్లడించారు. ఆ ముగ్గురు కలిసి నగరంతో సహా దేశవ్యాప్తంగా వేలాది మందికి యాప్‌ల ద్వారా అప్పులు ఇచ్చారని చెప్పారు. వాటిని వసూలు చేసేందుకు ఆ బ్యాంకు ఖాతాలు ఉపయోగించుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ మహిళను రుణ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారని తెలిపారు. నగ్నచిత్రాలు, వీడియోలు చూపి బెదిరించి రూ. 8 లక్షలు వసూలు చేశారని తెలియజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. విచారణలో భాగంగా నిందితుల బ్యాంకు ఖాతాలను గుర్తించామని వివరించారు. వాటి ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించామని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.