రెండు వేర్వేరు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. సైదాబాద్ పరిధిలో గొలుసు దొంగతనాలు చేస్తున్న సయ్యద్ అస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరున్నర తులాల బంగారం, కత్తి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఓల్ట్ మలక్‌పేటకు చెందిన అస్లాం ఈ నెల 2న కేశవనగర్, ఎల్బీనగర్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో బైక్‌ను దొంగిలించాడు.
నిందితుడిపై గతంలో హత్యాయత్నం, చోరీ కేసులతో పలు స్టేషన్లలో 40కి పైగా కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. పాత నేరగాళ్లతో జత కట్టి భూ వివాదాల్లోనూ తలదూర్చినట్లు పేర్కొన్నారు. అతనిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని వివరించారు.
అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చరవాణీలు దొంగతనం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేస్తున్నట్లు అంజనీకుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: నకిలీ బంగారంతో దోపిడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ