ETV Bharat / crime

ప్రసవం ఒకరికైతే... పాపను వేరే కుటుంబానికి ఇచ్చారు

ప్రసవం కోసం హూజూరాబాద్​ ఏరియా ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి వైద్యులు చికిత్స చేశారు. సురక్షితంగా తల్లి, బిడ్డను కాపాడారు. కానీ పాపను మాత్రం కుటుంబసభ్యులకు ఇవ్వలేదు. ఇంతకీ ఏమైంది?

huzurabad aria hospital staff mistake
ప్రసవం ఒకరికైతే... పాపను వేరే కుటుంబానికి ఇచ్చారు
author img

By

Published : Mar 30, 2021, 9:31 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్​కు చెందిన రజిత, మరో నలుగురు గర్భిణీలు ప్రసవ సేవలకై కరీంనగర్​ జిల్లాలోని హూజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. ముందుగా వైద్యులు రజితకు శస్త్ర చికిత్స చేశారు. ఆమె ఆడశిశువు జన్మించింది. ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా... ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఓ తప్పు చేశారు.

ఆస్పత్రి సిబ్బంది రజితకు పుట్టిన బిడ్డను... రచన అనే మరో మహిళ కుటుంబసభ్యులకు ఇచ్చారు. ఈ ఘటనపై రజిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్... ఆపరేషన్ థియేటర్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. రచనకు ఇంకా డెలివరీ కాలేదని... రజిత కుటుంబసభ్యులను పిలువగా.. రచన కుటుంబసభ్యులు వచ్చి పాపను తీసుకున్నారని పేర్కొన్నారు. శిశువులను అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటామని... ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగవని తెలిపారు. సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆరోగ్య ప్రదాయిని అరటి.. అందుకే డైట్‌లో భాగం చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.