కట్టుకున్నవాడే... కాలయముడిగా మారి ఓ ఇళ్లాలిని కొట్టించంపాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి... విపరీతంగా కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో జరిగింది. రుద్రారానికి చెందిన స్వప్నపై అనుమానం పెంచుకున్న భర్త సురేశ్... కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు.
సోమవారం రాత్రి ఆమెను చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను... అర్ధరాత్రి వేళ ఆస్పత్రికి తరలించినా... ప్రాణం దక్కలేదు. కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మరో ప్రాణం : కరోనాతో కానిస్టేబుల్ మృతి