Husband Suicide For Chicken: మహబూబ్‌నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన రతన్‌లాల్(32) రాధిక భార్యాభర్తలు. వారికి ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు కుమారులు, ఒక కూతురు. మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. దుండిగల్‌లో అద్దెకు ఉంటున్నారు. రతన్‌లాల్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఈ నెల 25(శుక్రవారం) సాయంత్రం రతన్‌లాల్ ఫూటుగా మద్యం సేవించాడు. చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. వెంటనే కోడికూర వండాలని భార్యను ఆదేశించాడు. భార్య నిరాకరించింది.
ఇటీవలే తాను, కూతురు ఇద్దరూ.. చికెన్‌ఫాక్స్(అమ్మవారు) బారినపడటం వల్ల మాంసాహారం తీసుకోకూడదంటూ భర్తకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. మత్తులో ఉన్న రతన్‌లాల్‌కు అదేది అర్థంకాలేదు. భార్యతో గొడవ పెట్టుకుని.. కోపంతో ఊగిపోతూ బయటకు వెళ్లిపోయాడు. మరుసటిరోజు (26న) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు. వెంటనే యాసిడ్ తాగేశాడు. బాధ బరించలేక ఇంటికొచ్చి యాసిడ్ తాగినట్టు కుటుంబసభ్యులకు తెలిపాడు.
అప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రతన్లాల్ను.. మొదట సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదివారం(27న) సాయంత్రం నారాయణ ఆసుపత్రికి మార్చారు. పరిస్థితి మెరుగవకపోవటంతో.. చికిత్స పొందుతూనే సోమవారం(28) అర్ధరాత్రి రతన్‌లాల్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: