ETV Bharat / crime

Husband murdered his wife: భార్య గర్భం దాల్చిందని గొంతు నులిమి చంపిన భర్త - telangana news

హైదరాబాద్​లోని సనత్‌నగర్‌ పోలీస్​ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అగ్నిసాక్షిగా కష్టసుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసిన భర్త అనుమానంతో భార్యను అతికిరాతకంగా హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Husband murdered his wife
Husband murdered his wife
author img

By

Published : Sep 27, 2021, 4:32 PM IST

హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు దారుణ హత్యకు గురయ్యారు. అనుమానం కారణంగా ఆదివారం అర్ధరాత్రి సమయంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన గంగాధర్‌.. మానసను గొంతు నులిమి చంపాడు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మానసకు జగద్గిరిగుట్ట నివాసితుడైన గంగాధర్‌తో గతేడాది నవంబర్‌లో వివాహం జరిగింది. వీరిద్దరు కలిసి భరత్‌నగర్‌లో నివాసముంటున్నారు. వివాహమైన రెండు నెలలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో మానస తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. పది రోజుల క్రితం గంగాధర్‌ తండ్రి చనిపోవడంతో భర్త వద్దకు మానస వచ్చింది. తన వద్ద లేకున్నప్పటికీ గర్భం దాల్చిందనే అనుమానంతో కోపాద్రిక్తుడైన గంగాధర్‌.. మానసను గొంతు నులిమి హత్యచేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: Manikonda Man Missing Incident: మణికొండలో గల్లంతైన రజినీకాంత్‌ మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.