ETV Bharat / crime

దారుణం: క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త

క్షణికావేశం ఓ ఇల్లాలి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ముక్కు పచ్చలారని చిన్నారులకు అమ్మ ప్రేమను దూరం చేసింది. భార్యను గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడో ఓ దుర్మార్గుడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే క్వార్టర్స్ జరిగింది.

Husband killed wife at kazipet railway quarters  in Warangal urban district
దారుణం: క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Mar 24, 2021, 9:54 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే క్వార్టర్స్​లో దారుణం జరిగింది. కసాయి భర్త కట్టుకున్న భార్యనే అంతమొందించాడు. క్షణికావేశంలో జరిగిన ఘటనతో ఇద్దరు చిన్నారులు అమ్మప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతితో మిన్నంటిన కుమారుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.

కాజీపేటకు చెందిన మేకల లక్ష్మి రైల్వేలో ఉద్యోగం చేస్తూ అక్కడే క్వార్టర్స్​లో నివాసముంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాస్, కోడలు రమ, ఇద్దరు మనవళ్లు లక్ష్మి వద్దే ఉంటున్నారు. శ్రీనివాస్​కు భార్యతో సాయంత్రం ఇంట్లో గొడవ జరగగా క్షణికావేశంలో రమను కత్తితో గొంతులో పొడిచాడు. రక్తం కారుతుండగానే బయటకు పరుగెత్తుకొచ్చిన రమ అక్కడే కుప్పకూలిపోయింది. శ్రీనివాస్ ఎక్కువగా మద్యం సేవిస్తుంటాడని.. అతని మానసిక స్థితి కూడా సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

హత్యపై సమాచారం అందుకున్న వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు, బంధువుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

ఇదీ చూడండి: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.