ETV Bharat / crime

అర్ధరాత్రి దారుణం.. ఉలిక్కిపడిన గ్రామం - Andhra Pradesh latest news

Husband killed Wife: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండలం కసుకరు గ్రామంలో ఓ వ్యక్తి భార్యను హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యలే అందుకు కారణమని తెలుస్తుండగా.. అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

Husband killed Wife
Husband killed Wife
author img

By

Published : Jan 16, 2023, 3:20 PM IST

Husband killed Wife: పండగ వేళ ఊరంతా సందడిగా ఉంది. బంధుమిత్రుల రాకతో స్థానికంగా కోలాహలం నెలకొంది. అందరూ సంక్రాంతి సంబురాల్లో మునిగితేలారు. అర్ధరాత్రి కావడంతో అలసిపోయి గాఢనిద్రలోకి వెళ్లారు. ఇంతలోనే ఓ ఇంట్లో జరిగిన దారుణంతో ఊరంతా ఉలిక్కిపడింది. భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలుసుకున్న ఊరి జనం భయాందోళనకు గురయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలు కసుకరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామానికి చెందిన చిన్న సుబ్బారావు-రోజా భార్యాభర్తలు. కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆ కారణంతో తరచూ ఆందోళనకు గురవుతున్న వీరు.. బంధువులు, స్నేహితులు తమను చిన్నచూపు చూస్తున్నారని కుమిలిపోయేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న రోజాపై పదునైన ఆయుధంతో సుబ్బారావు దాడి చేశాడు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

అర్ధరాత్రి దారుణం.. ఉలిక్కిపడిన గ్రామం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.