ETV Bharat / crime

బెడ్​రూంలోని శృంగార చిత్రీకరణకు భర్త పట్టు.. వద్దని భార్య బెట్టు.. చివరికి.. - క్రైమ్ వార్తలు

భారతీయ సంస్కృతి ప్రకారం కాపురం అనేది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితమైన అంశం. నాలుగు గోడల మధ్య అన్యోన్యంగా సాగాల్సిన సృష్టి కార్యం అది. అలాంటి శృంగారం నలుగురి కంట పడితే..? పరువు బజారున పడుతుంది.. మానం మర్యాద మంట గలిసిపోతాయి.. సంసారం కుప్పకూలిపోతుంది.. మరి, ఇవన్నీ ఆలోచించాడో లేదో..? అసలు అతని మనసులోని దుర్భుద్ధికి కారణాలేంటో తెలియదు కానీ.. బెడ్ రూమ్ సన్నివేశాలను వీడియో తీయాలని పట్టుబట్టాడు ఓ భర్త! సంప్రదాయ పద్ధతుల్లో పెరిగిన భార్య అందుకు ససేమిరా అంది. అయినా.. చెప్పిన పని చేయాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో.. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్​కు చేరింది! ఆ తర్వాత ఏమైంది??

husband-demands-bedroom-video-of-wife-in-east-godavari

author img

By

Published : Jul 10, 2022, 4:29 PM IST

సంసారం మూడు పువ్వులూ.. ఆరు కాయలు అన్న చందంగా సాగాలన్నా.. పెళ్లంటే నూరేళ్ల పంట అనిచెప్పిన పెద్దల నానుడి నిజమవ్వాలన్నా.. భార్యాభర్త మధ్యల చక్కనైన అనుబంధం ఉండాలి. ఈ బంధం.. తనువు, మనసు ఒకటైన వేళ మరింత బలపడుతుంది. అయితే.. భార్యాభర్తలు తమ మానసిక బంధం ఎంత బలమైనదో ప్రపంచానికి చాటి చెప్పుకోవచ్చు. కావాలంటే.. అందుకు సాక్ష్యాలు కూడా చూపించుకోవచ్చు. కానీ.. తమ శారీరక బంధం ఎలా ఉందో సమాజానికి చూపించాలనుకుంటే..? అత్యంత దరిద్రంగా ఉంటుంది. నలుగురిలో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. పరువు గంగలో కలిసిపోతుంది.. సరిగ్గా ఇదే పనికి సిద్ధపడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యతో కలిసి నాలుగు గోడల మధ్య సాగించే కాపురాన్ని వీడియో తీసేందుకు సిద్ధమయ్యాడు. నిర్ఘాంతపోయిన భార్య ఇదేంటని ప్రశ్నిస్తే.. తీసి తీరాల్సిందేనంటూ వేధించడం మొదలు పెట్టాడు.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువతికి.. కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు సైతం అందజేశారు. బంధు మిత్రుల నడుమ వైభవంగా పెళ్లి చేశారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. మంచి అల్లుడు దొరికాడని అమ్మాయి తరపువారు సంతోషపడేంతలోనే.. కొత్త జంట కాపురంలో కలతలు మొదలయ్యాయి.

పద్ధతిగా పెరిగిన ఏ యువతి అయినా.. తన తనువు, మనసుతో పాటు సర్వస్వం భర్తకే అర్పించాలని కోరుకుంటుంది. ఇక్కడా అదే జరిగింది. కానీ.. ఆ కార్యాన్ని వీడియో తీయాలని పట్టుబట్టాడు భర్త. ఈ దారుణమైన కోరిక తెలిసి నిశ్చేష్టురాలైంది భార్య. ఇదేం పద్ధతి అని నిలదీసినా.. మొండికేశాడు తప్ప, ఆమె ఆవేదన అర్థం చేసుకోలేదు. బెడ్ రూమ్ వీడియో కావాల్సిందేనని వేధించడం మొదలు పెట్టాడు.

ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. జీవితాంతం తోడుగా ఉంటాడని.. కష్టసుఖాల్లో అండగా ఉంటాడని నమ్మిన వాడు.. ఇలా వేధిస్తుండడంతో రోధించింది. ఇంట్లో వాళ్లకు చెప్పలేక తనలో తానే కుమిలిపోయింది. అయినా.. అతని మనసు కరగలేదు. సభ్యసమాజంలో ఏ భార్య కూడా వినకూడని మాట అది. చేయకూడని పని అది. అయినా.. చేయాల్సిన దుస్థితిలోకి నెట్టేయబడింది. ఈ మనోవేదతో తీవ్రంగా కుంగిపోయిన బాధితురాలు.. ఎదురు తిరిగింది. ఈ వికృతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. భర్త అరాచకాలను వివరిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకూ రాకుండా తగిన బుద్ధి చెప్పాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.