Woman Hulchal in Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఓ మహిళ నానా హంగామా సృష్టించింది. బస్టాండ్ ఆవరణలో పదే పదే చిన్న పిల్లల్ని పట్టుకునేందుకు యత్నిస్తున్న ఓ మహిళను స్థానికులు చితకబాదారు. తొలుత మూడు గంటల పాటు ఆమెను స్టేషన్లో ఉంచిన పోలీసులు తిరిగి పంపించేశారు. మద్యం మత్తులో ఉన్న ఆమె భర్తకు స్థానికులు దేహశుద్ధి చేశారు.
మళ్లీ బస్టాండ్‌కు వచ్చిన ఆమె... ప్రయాణికులను ఇబ్బంది పెడుతోందని తోటి వారు ఆగ్రహంతో చితకబాదారు. అయితే, మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. అనుమానస్పద రీతిలో ప్రవర్తిస్తున్న వీరు ఛత్తీస్ గఢ్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: