ETV Bharat / crime

Fire accident in nizamabad సూపర్​ మార్కెట్​లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తినష్టం - నిజామాబాద్​లో టీ మార్ట్​లో అగ్నిప్రమాదం

Fire accident in nizamabad నిజామాబాద్​లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని టీ మార్ట్ సూపర్ మార్కెట్‌లో మంటలు చెలరేగి వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Fire accident in nizamabad
Fire accident in nizamabad
author img

By

Published : Aug 28, 2022, 10:06 AM IST

Fire accident in nizamabad: నిజామాబాద్ ఆర్యనగర్‌లోని టీ మార్ట్ సూపర్ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోగా.. వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది... నాలుగు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని టీమార్ట్‌ యజమాని శేఖర్‌ తెలిపారు. గతంలో భాగస్వాములుగా ఉన్న వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

సూపర్​ మార్కెట్​లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తినష్టం

ఇది మా ఫ్రైండ్స్​తో కలిసి పార్ట్​నర్​షిప్​లో పెట్టుకున్నాం. ఇది వాళ్లు చేసిన పనే అని అనుమానంగా ఉంది. ఎందుకంటే మాకు వాళ్లకు గొడవలు జరుగుతున్నాయి. సీపీ ముందు నాకు వార్నింగ్​ కూడా ఇచ్చారు. నేను ఇప్పటికే ఒకసారి కంప్లైంట్​ ఇచ్చా. ఇక వాళ్లే చూసుకుందామన్నారు. ఇప్పుడు ఇలా చేశారు. దాదాపు రూ.2కోట్ల నష్టం వాటిల్లింది. -శేఖర్, టీమార్ట్ సూపర్ మార్కెట్ యజమాని

ఇవీ చదవండి: చోరి చేసిన ఇంటిని తగలబెట్టిన దొంగలు, ఎందుకంటే

అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే, ఏం జరుగుతుందో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.