ETV Bharat / crime

house burglaries in hyderabad : సంక్రాంతికి ఊరెళ్లొచ్చారు... తీరా వచ్చేసరికి..! - తెలంగాణ నేర వార్తలు

house burglaries in hyderabad : సంబురంగా సంక్రాంతికి ఊరెళ్లొచ్చారు. తీరా వచ్చేసరికి... ఇళ్లు గుల్లయ్యాయి. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు జరిగాయి. ఎస్ఆర్ నగర్​లో మూడు రోజుల క్రితం ఓ ఇంట్లో కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు చోరీకి గురయ్యాయి. శివారు ప్రాంతాలే లక్ష్యంగా దొంగలు దోచేశారు.

house burglaries in hyderabad , thefts in hyderabad outskirts
శివార్లలో భయంభయం.. రెచ్చిపోతున్న దొంగలు
author img

By

Published : Jan 17, 2022, 8:13 PM IST

house burglaries in hyderabad : హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాల్లోని తాళం వేసి ఉన్న ఇళ్లే దొంగల టార్గెట్. పండుగకు ఊరెళ్లి ఇంటికి వచ్చేసరికి... దోచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆదిబట్ల పీఎస్ పరిధిలోని రాగన్నగూడ లక్ష్మి మెఘా టౌన్ షిప్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఓ ఇంట్లో ఆరు తులాల బంగారం, రూ.3వేల నగదు, మరో ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రూ.7వేల నగదు ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లల్లో చోరీకి యత్నించారు. చుట్టుపక్కల వాళ్లు మేల్కొనడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.

కోటి రూపాయల ఆభరణాలు చోరీ

మూడు రోజుల క్రితం ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలోని రాజీవ్ నగర్​లో చోరి జరిగింది. ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో 4 కిలోల బంగారం, 4 కిలోల వెండి, రూ.25లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టిన దొంగలు... బీరువా, లాకర్​లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. వాటి మొత్తం విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అపార్టుమెంట్​లో ఉన్న పక్క ఫ్లాట్ల యజమానులకు ఎలాంటి అనుమానం రాకుండా చోరీ చేశారు. ఓ పాత నేరస్థుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

తాళాలు పగలగొట్టి...

గత వారం దుండిగల్ పీఎస్ పరిధిలోని సూరారం విశ్వకర్మ కాలనీ, సాయిబాబా నగర్​లో రెండు ఇళ్ల తాళాలను పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లల్లో కలిపి 6.5తులాల బంగారం, 32 తులాల వెండి చోరికి గురైంది. కూకట్ పల్లిలోని ఎల్లమ్మబండలో ఇంటి తాళాలు పగలగొట్టి దోచేశారు. 8 తులాల బంగారు ఆభరణాలు, 30తులాల వెండి, రూ.20వేల నగదను అపహరించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్​లో ఓ శుభకార్యానికి వెళ్లి మరుసటి రోజు ఉదయం 6గంటలకు ఇంటికి వచ్చే సరికి దోచేశారు. జంతువులను ఎత్తుకెళ్లే ముఠా శివారు ప్రాంతాల్లో సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. నిజాంపేటలోని మేకల దొడ్డిలోకి చొరబడిన ఓ దొంగ మేకను చంపాడని... అలికిడి విని దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

పోలీసుల హెచ్చరికలు

విద్యార్థులకు సెలవులు పొడగించడంతో పండగకు ఊరెళ్లిన వారు మరికొన్ని రోజులు అక్కడే ఉండిపోయే అవకాశం ఉంది. సొంతూళ్లకు వెళ్లే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు పదే పదే సూచించినా... కొంత మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల ఇళ్లు విడిచిపెట్టి వెళ్లాల్సివస్తే... ఇంట్లో విలువైన వస్తువులు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. పక్కింటి వాళ్లకు ఇంటిని గమనిస్తూ ఉండాలని చెప్పాలని అంటున్నారు. ఇంటి ముందు ప్రధాన ద్వారానికి తాళం వేయకుండా లోపలి వైపు నుంచి గడియ పెట్టి... వెనక వైపు ఉన్న తలుపు తాళం వేస్తే మంచిదని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోని ఓ గదిలో లైట్ వేసి ఉంచితే ఇంట్లో ఎవరో ఉన్నారనే భావన కలుగుతుందని... దొంగతనాలు తగ్గించవచ్చునని పేర్కొన్నారు. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని... వాటిని సెల్ ఫోన్​కు కనెక్ట్ చేసుకుంటే... ఇంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

గస్తీ పెంచిన పోలీసులు

దొంగతనాల నివారణకు పోలీసులు ఈసారి గస్తీ పెంచారు. సంక్రాంతి కంటే ముందు నుంచి ప్రజలకు అవగాహన కలిగేలా కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గోడపత్రికలు అంటించారు. మరికొన్ని పోలీస్ స్టేషన్లలో చాటింపు వేయించారు. ఫలితంగా ఇళ్లల్లో చోరీలు కాస్త తగ్గాయి. చెడ్డీ గ్యాంగ్, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలపైనా పోలీసులు పీడీ చట్టం ప్రయోగించి జైళ్లలో పెట్టడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముఠాల బెడద తగ్గింది.

ఇదీ చదవండి: Veerabhadra swamy brahmotsavam : వైభవంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.