Five died with drunk duplicate white water: ఏపీ తూర్పుగోదావరి జిల్లా మన్యంలో జీలుగు కల్లు ఐదుగురు ప్రాణాల్ని బలిగొంది. రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లోదొడ్డిలో ఈ ఉదయం ఐదుగురు జీలుగు కల్లు తాగారు. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిని గంగరాజు, సన్యాసిరావు, లోవరాజు, సుగ్రీవులు, ఏసుబాబుగా గుర్తించారు. కల్లులో విషం కలిపినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
25 లక్షల పరిహారం ఇవ్వాలి...
ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. జీలుగుకల్లు తాగి ఐదుగురు చనిపోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ మద్యం విధానం వల్లే ఇలాంటి ఘటనలు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడటం వల్లే ఈ దుస్థితి"
- చంద్రబాబు, తెదేపా అధినేత
మద్యంలో జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తి కారణంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తూ.గో జిల్లా రాజవొమ్మంగిలో కల్తీ కల్లు ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యం అమ్ముతుండటంతో ప్రత్యామ్నాయంగా కల్లు, శానిటైజర్ వంటివి త్రాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: