ETV Bharat / crime

రైల్వే కొలువుల పేరిట ఘరానా మోసం - Cheating In Railway Jobs Latest News

రైల్వే కొలువుల పేరిట ఏపీ అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఘరానా మోసం చోటు చేసుకుంది. దాదాపు 50 మంది అభ్యర్థుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

fraud in railway jobs recruitment
fraud in railway jobs recruitment
author img

By

Published : May 23, 2021, 11:00 PM IST

ఏపీ అనంతపురం జిల్లాలో రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటనలో పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. చెన్నైకి చెందిన 12 మంది బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. నకిలీ నియామక పత్రాలతో మోసగించారని వారు ఫిర్యాదు చేశారు. 50 మంది నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

'ఇవి నకిలీ పత్రాలు'

నకిలీ ధ్రువపత్రాలతో గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లిన బాధితులు.. నియామక పత్రాలను అధికారులకు అందించారు. వాటిని పరిశీలించిన అధికారులు.. నకిలీ పత్రాలుగా గుర్తించారు. కేసును గుంతకల్లు ఒకటో పట్టణ పోలీసులకు బదలాయించారు. ఈ క్రమంలో నిందితుడు ఈనెల 18న కరోనాతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : కూసుమంచిలో విషాదం.. కరోనా కాటుకు యువ దంపతుల బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.