శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ.. ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి 1481.10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళల నుంచి 991 గ్రాములు, 168.5 గ్రాములు, 321.60 గ్రాముల చొప్పున బంగారం గుర్తించినట్లు చెప్పారు. మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.72.80 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి: Live Video: కరీంనగర్‌లో భారీ వర్షం.. కూలిన 70 అడుగుల ఎత్తైన లుమినార్