ETV Bharat / crime

Heavy Drugs Seized: 'డ్రగ్స్ అమ్మేవారే కాదు.. వాడేవారి పైనా చర్యలు'

Heavy Drugs seized
భారీగా డ్రగ్స్ పట్టివేత
author img

By

Published : Jan 6, 2022, 10:29 AM IST

Updated : Jan 6, 2022, 1:58 PM IST

10:24 January 06

కొకైన్, హెరాయిన్, మత్తు పదార్థాలు సీజ్ చేసిన పోలీసులు

భారీగా డ్రగ్స్ పట్టివేత

Heavy Drugs seized: హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. కొందరు మాత్రం డ్రగ్స్​ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. అలా నూతన సంవత్సర వేడుకలకు ముంబయికి చెందిన ముఠా హైదరాబాద్​కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి భారీ మొత్తంలో కొకైన్, హెరాయిన్, మత్తు పదార్థాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

డ్రగ్స్ ముఠా నుంచి 99 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 17 ఎల్ఎస్డ్​ఈ, 17 టాబ్లెట్లు, 27 ఎక్సాటీసి టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. 3 బృందాలుగా విడిపోయి 7 గురిని అరెస్ట్ చేశాం. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు టోనీ డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. ఏజెంట్లను నియమించుకుని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు.

డేకాయిట్ ఆపరేషన్ చేసి మాదక ద్రవ్యాల సరఫరాదారులను హైదరాబాద్​కు రప్పించాము. ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు పంజాగుట్టకు వచ్చి హోటల్​లో బస చేయగా పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. మరో అంతర్ రాష్ట్ర ముఠాను కూడా ఇదే విధంగా అరెస్ట్ చేశాం. చాదర్ ఘాట్​కు చెందిన ఖైసర్ ముంబై ముఠాతో చేతులు కలిపి హైదరాబాద్​లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారు. పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్ట్ చేయగలిగాం. తిరుమలగిరి పోలీసులు కూడా ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసి మత్తు పదార్థాల టాబ్లెట్లు విక్రయిస్తున్నారు.

మొత్తం 3 కేసుల్లో 7 సభ్యుల అరెస్ట్ చేశాము. 16 లక్షలకు పైగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాం. మాదక ద్రవ్యాలు ఎవరెవరు వినియోగిస్తున్నారో వాళ్ల జాబితా కూడా సేకరిస్తున్నాము. మాదక ద్రవ్యాల బాధితుల విషయంలో మానవీయ కోణంలో ఇన్ని రోజులు ఆలోచించాము. ఇకపై అవసరమైతే వాళ్లను చట్ట ప్రకారం అరెస్ట్ చర్యలు తీసుకుంటాము. డిమాండ్​ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చు.

-సీపీ, సీవీ ఆనంద్

మాదక ద్రవ్యాల బాధితుల విషయంలో ఇకపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్​ ఫలించిందన్నారు.

ఇదీ చూడండి: Cyberabad CP: 'నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్​కు డ్రగ్స్ రవాణా'

Last Updated : Jan 6, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.