ETV Bharat / crime

rape and murder: యువతిపై అత్యాచారం చేసి.. 10వ అంతస్తు నుంచి తోసేసి! - ఉత్తరప్రదేశ్‌

మహిళలపై లైంగిక అకృత్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అతివలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మరో పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది.

rape and murder
rape and murder
author img

By

Published : Sep 24, 2021, 5:03 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 19ఏళ్ల యువతిని రేప్‌ చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడో మానవమృగం. తన వద్ద ఉద్యోగం చేస్తున్న యువతిని లైంగికంగా లొంగదీసుకొనేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ప్రణాళిక ప్రకారం తన ఫ్లాట్‌కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ.. చివరకు నేరం అంగీకరించాడని పోలీసుల వెల్లడించారు.

ప్రతీక్‌ వైశ్‌ (40) అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద బాధిత యువతి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్‌.. మంగళవారం పని ఉందని చెప్పి బాధితురాలిని కల్యాణ్‌పూర్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. డబ్బు ఇస్తానని కూడా ఆశచూపాడు.. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ బీబీజీటీఎస్‌ మూర్తి వివరించారు.

ఈ దారుణం గురించి పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించడంతో నిందితుడు పదో అంతస్తులో తాను ఉంటున్న ఫ్లాట్‌ బాల్కనీ నుంచి కిందకు తోసేయడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచి కస్టడీకి తరలించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: మూగ యువతిపై కన్నేసిన కామాంధుడు.. శివారుకు తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.