హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని హెచ్సీయూ (HYDERABAD CENTRAL UNIVERSITY)లో విషాదం నెలకొంది. పీహెడ్డీ విద్యార్థి శివరమాచంద్రన్ ఆత్మహత్యకు యత్నించాడు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శివ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ- తెలుగు మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం వసతిగృహంలోని తన గదిలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి విద్యార్థులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తన స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడినట్లు సమాచారం. తెలుగు పరిరక్షణ కోసం శివ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు సన్నిహితులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచూడండి: Cyber crimes Types: ఫెస్టివల్ ఆఫరా.. స్పెషల్ గిఫ్ట్ వచ్చిందా? కాస్త ఆలోచించండి!