సోదరికి ఇవ్వాల్సిన కట్నం కోసం భార్యను అదనపు కట్నం తెమ్మని వేధించసాగాడు. భర్తతోపాటు అతని కుటుంబ సభ్యుల ఆగడాలు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. కంచన్‌బాగ్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా లైన్‌గడ్డ చెన్నుకు చెందిన మహమ్మద్ హాశం దంపతుల కుమార్తె హసీన పర్వీన్(22) వివాహం 2020లో కంచన్‌బాగ్ హాఫిజ్‌బాబానగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ మహమ్మద్ సుల్తాన్(27)తో జరిగింది.
పిల్లలు పుట్టడం లేదన్న సాకుతో తరచూ హింసించేవాడు. చెల్లి పెళ్లికి కట్నం కోసం భార్యను రూ.2 లక్షలు తెమ్మని వేధించాడు. తండ్రి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లడం.. చక్కగా చూసుకుంటానని భర్త నమ్మించి తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇటీవల ఆమె తండ్రి రూ.లక్ష పంపించారు. మరో రూ.లక్ష తేవాలని వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లింది. తనవద్ద ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు భర్తకు ఇచ్చేసింది.
చెల్లి పెళ్లి కోసమని భార్యను తీసుకొచ్చాడు. డిసెంబర్ 1 అర్ధరాత్రి తండ్రికి ఫోను చేసి వేధిస్తున్నట్లు తెలిపింది. రెండున్నర గంటల తరువాత మీ అమ్మాయి ఉరేసుకుందని అల్లుడు ఫోనులో చెప్పడంతో తండ్రి హతాశుడయ్యాడు. అల్లుడు అతని కుటుంబ సభ్యులపై శుక్రవారం ఫిర్యాదు చేయడంలో సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: