ETV Bharat / crime

Petrol attack in hanamkonda: దుకాణంపై పెట్రోల్ దాడి.. భార్యాభర్తలు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

చిట్ డబ్బులు అడిగినందున ఓ షాపు యజమానిపై పెట్రోల్ దాడి చేసిన నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అవసరానికి చిట్ పాడుకున్న వ్యక్తి... ఆ డబ్బులు అడిగాడన్న కోపంతో నిందితులు షాపు యజమాని రాజుపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించారని పోలీసులు తెలిపారు.

Petrol attack in hanamkonda, petrol assault on shop
దుకాణంపై పెట్రోల్ దాడి, భార్యాభర్తలు అరెస్ట్
author img

By

Published : Sep 4, 2021, 8:45 PM IST

చిట్ డబ్బులు అడగడంతో సజీవ దహనానికి యత్నించిన ఘటనలో భార్యాభర్తలను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అవసరానికి చిట్ పాడుకున్న వ్యక్తి... ఆ డబ్బులు అడిగాడన్న కోపంతో దుకాణానికి నిప్పు పెట్టి... షాపు యజమాని రాజును సజీవ దహనం చేసేందుకు యత్నించిన నిందితురాలు గొడుగు కావ్యతో పాటు ఆమె భర్త గణేష్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయాంత్రం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న శ్రీ సెల్‌ వరల్డ్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెండు చెక్కులు బౌన్స్

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడు గొడుగు గణేష్ ఓ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తుంటారు. ఇతడి ద్వారా బాధితుడు రూ.ఐదు లక్షల చిట్ వేశారు. కొద్దిరోజుల తర్వాత బాధితుడు రాజు తన అవసరం కోసం చిట్ పాడుకున్నారని తెలిపారు. ఆ డబ్బు కోసం పలుమార్లు చిట్ ఫండ్ యాజమాన్యాన్ని సంప్రదించడంతో... చివరగా ఆ కంపెనీ మూడు బ్యాంక్ చెక్కులను అందజేసిందని వెల్లడించారు. వాటిలో ఒక చెక్కుకు మాత్రమే కొంత మొత్తం డబ్బు రాగా... మిగతా రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాధితుడు రాజు మిగతా చిట్ డబ్బుల గురించి ఏజెంట్ గణేష్‌ను బాధ్యుడిని చేస్తూ పలుమార్లు నిలదీసినట్లు వివరించారు.

దంపతులు అరెస్ట్

రెండు రోజుల క్రితం నిందితుడు గణేష్ ఇంటికి వెళ్లి రాజు నిలదీయగా... ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. దీనిని మససులో పెట్టుకొని పథకం ప్రకారం నిందితుడు గణేశ్ ప్రోత్సాహంతో అతడి భార్య కావ్య సెల్ ఫోన్ షాపుపై పెట్రోల్ చల్లిందని పోలీసులు తెలిపారు. రాజుపై పెట్రోల్ పోసి... తనతో పాటు తెచ్చుకున్న లైటర్‌తో నిప్పు అంటించిందని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నామని వివరించారు. శనివారం ఉదయం నిందితులైన భార్యాభర్తలు ఎనుమాములకు వెళ్లే కాశిబుగ్గ క్రాస్ రోడ్డు వద్ద ఉన్నట్లుగా పక్కా సమాచారంతో వెళ్లి... అరెస్టు చేశామని తెలిపారు. విచారణలో వారు ఈ ఘటనను అంగీకరించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:Petrol attack: చిట్టి డబ్బులు అడిగినందుకు భార్యతో పెట్రోల్​ పోయించి అంటించాడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.