టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో రూ.18,130 విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జక్లేర్ గ్రామంలోని ఓ దుకాణంలో నిల్వ ఉంచిన గుట్కాని సీజ్ చేశారు.
దుకాణ యజమాని రవిపై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.

ఇదీ చదవండి: పరిశుభ్రతా స్కోర్లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్ రూరల్