ETV Bharat / crime

అలా అన్నందుకు తాతను చంపిన మనవడు.. ఎక్కడంటే..? - ఏపీ నేర వార్తలు

Grandson killed his grandfather : ఏపీలోని కర్నూలు నగరంలో ఈ నెల మూడో తేదీన జరిగిన సుబ్రహ్మణ్యం శర్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మనవడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు మనవడు దీపక్​ శర్మ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

అలా అన్నందుకు తాతను చంపిన మనవడు.. ఎక్కడంటే..?

author img

By

Published : Dec 6, 2022, 7:36 PM IST

అలా అన్నందుకు తాతను చంపిన మనవడు.. ఎక్కడంటే..?

Grandson killed his grandfather : అతడు రిటైర్డ్ ఉద్యోగి. తనకు వచ్చే పింఛన్‌తో హాయిగా కాలం వెల్లదీస్తున్నాడు. కానీ అతడి మనవడు దీపక్ శర్మ మాత్రం ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. దాంతో ఏదైనా పని చేసుకోవాలంటూ మనవడిని ఒకటి, రెండు సార్లు మందలించాడు ఆ వృద్ధుడు. తనపై తాత పెత్తనం ఏంటనుకున్నాడో ఏమో గానీ.. ఆ తాతను అంతమొందించాలనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అనుకున్నంత పని చేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి మెల్లిగా పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారించడంతో దీపక్‌ శర్మే హంతకుడని తేలింది. సొంత మనవడే తాతను హత్య చేసినట్లు కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్‌ తెలిపారు.

వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన సుబ్రహ్మణ్య శర్మ కర్నూలు నగరంలోని మాధవి నగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగించేవాడు. తన మనవడు దీపక్ శర్మ ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడంతో సుబ్రహ్మణ్య శర్మ మనవడిని మందలించాడు. పౌరోహిత్యం నేర్చుకోమని చెప్పడంతో పాటుగా తన దగ్గర తీసుకున్న డబ్బుల విషయంలో మనవడిని సుబ్రహ్మణ్యం ప్రశ్నించాడు. దీంతో కోపం పెంచుకున్న మనవడు దీపక్‌ శర్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 3 కత్తులతో తాతపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇవీ చదవండి:

డ్రమ్ములో మృతదేహం కేసులో వీడిన చిక్కుముడి.. విచారణలో విస్తుపోయే విషయాలు

ఆన్‌లైన్‌ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ఉచ్చులో 14వేల మంది మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.