ETV Bharat / crime

పంథా మార్చని ప్రభుత్వ అధికారులు.. ఏసీబీకి దొరికి జీవితం ఆగం

Rides of ACB officers in Telangana state: అవినీతి నిరోధక శాఖ ఎన్ని కేసులు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వంలోని అవినీతి అధికారులు పంథా మారడం లేదు. లంచం తీసుకుంటూ చాలా మంది అధికారులు ఏసీబీ అధికారులకు దొరికి వారి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో ఏసీబీ వలకు దొరికిన అవినీతి చేపల ఆగడాలు చూస్తేంటే ప్రభుత్వ ఆఫీస్​లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ACB officials in Telangana state
ACB officials in Telangana state
author img

By

Published : Oct 21, 2022, 11:52 AM IST

Rides of ACB officers in Telangana state: అవినీతి నిరోధక శాఖ ఎన్ని కేసులు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వంలోని అవినీతి అధికారుల పంథా మారడం లేదు. రాష్ట్రంలో లంచం తీసుకుంటూ పలు హోదాల్లో ఉన్న అధికారులు పట్టుబడ్డారు. హైదరాబాద్, బాలాపూర్ కి చెందిన విజయ్, రాజు అనే వ్యాపారులు భువనగిరి మండలం అనాజిపూర్ లో ఎరువుల దుకాణం ఏర్పాటు కోసం భువనగిరి మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డిని సంప్రదించారు.

లైసెన్స్‌ కోసం రెండు లక్షలు తీసుకుంటుండగా వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని, ఇంట్లో సైతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా బూడిదంపాడులో గుత్తేదారు వద్ద 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులను వల పన్ని ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

పని చేసిన బిల్లులు మంజూరు చేయమని అడగగా లంచం అడగటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అవినీతిపై సమాచారం అందిస్తే అధికారులను పట్టుకుని తగు చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారుల తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.