హైదరాబాద్‌లోని గోల్కొండ నకిలీ నోట్ల(golkonda fake currency case update) వ్యవహారంలో నిందితుల వద్ద లభించిన నోట్లు సినిమాలో ఉపయోగించేవని పశ్చిమ మండలం సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన నిందితురాలైన రుయ్‌కు అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో తన వద్ద డబ్బులు ఉన్నాయని... తిరిగి ఇచ్చేస్తానని నకిలీ నోట్లను(fake currency news) సామాజిక మాధ్యమాల ద్వారా అప్పుల వాళ్లకు చూపించినట్లు శ్రీనివాస్ తెలిపారు. అయితే రుయ్ తనకు పరిచయం ఉన్న సినీ నిర్మాత వెంకట్ ద్వారా ఈ నోట్లు తీసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో నిర్మాత వెంకట్‌ను సైతం అరెస్ట్ చేసినట్లు ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ గోల్కొండ ఠాణా పరిధి 7టూమ్స్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నెల 8న రూ.2కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితురాలైన రుయ్‌ను అప్పుల వాళ్లు ఇబ్బంది పెట్టడంతో... తన వద్ద డబ్బులు ఉన్నట్లు అప్పుల వాళ్లను నమ్మించడానికి సినిమాలో ఉపయోగించే నకిలీ నోట్లను సినీ నిర్మాత వెంకట్ నుంచి సేకరించింది. సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని అప్పల వాళ్లకు చూపించాలని అనుకుంది. కానీ విశ్వసనీయ సమాచారంతో మాటు వేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా నకిలీ నోట్ల గుట్టు రట్టయింది.
ఇదీ చదవండి: fake notes seized : గోల్కొండలో రూ.2కోట్ల నకిలీ నోట్లు పట్టివేత